Addam News
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 2:54 am Posted by : Addam News

ప్రతిభను గుర్తించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం – గుండగోని భరత్ గౌడ్

ప్రతిభను గుర్తించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం
– గుండగోని భరత్ గౌడ్
పార్శిగుట్ట‌లో కోలాహలంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

సికింద్రాబాద్, జనవరి 11, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్‌న‌గ‌ర్‌లో బిజెపి నాయకురాలు, కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గుడ్డగాని భరత్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… భారతదేశంలో మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకపోవడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు. ఈ రోజు ఈ ముగ్గుల పోటీలో చాలా చక్కటి ముగ్గులు వేసి దేశ భక్తిని.. దైవ భక్తిని చాటే విధంగా ముగ్గులు వేయడం చాలా సంతోషమని అన్నారు. మహిళలను పిల్లలను వాళ్లలో దాగివున్న సృజనాత్మక ను బయటికి తీసి వారి ప్రతిభను గుర్తించాలని వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో అట్టహసంగా నిర్వహించిన మేకల కీర్తి హర్షకిరణ్‌ను భరత్ గౌడ్ అభినందించారు. అనంతరం పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. పోటీలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక బహుమతులు మేకల కీర్తి హర్షకిరణ్ అందజేశారు.

         మేకల కీర్తి మాట్లాడుతూ… ప్రజలకు సేవ చేయడమే నిస్వార్ధంగా పనిచేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయడం జీవితానికి తృప్తినిస్తుందని మేకల కీర్తి హర్షకిరణ్ అన్నారు. స్కిల్ డెవల‌ప్‌మెంట్ సెంటర్ల ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించానని, భవిష్యత్తులో వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని కార్యకర్తలే నా బలమన్నారు. నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని రాజకీయంగా మీ తోడు ఉండాలని కార్యకర్తలను ప్రజలను మేకల కీర్తి హర్షకిరణ్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేకల సారంగపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, కందటి నాగేశ్వర్ రెడ్డి, శారదా మల్లేష్, అజయ్ నాయుడు, ఆకారం రమేష్, శ్యాంసుందర్, అనూష, నాగరాణి, శోభ, భాగ్యమ్మ, యాదమ్మ, హనుమంతు ముదిరాజ్, అంబాల రాజేశ్వరరావు, ఇవి నరేష్, ఆదర్శ్ కుమార్, శ్యాoసుందర్, సాయి దత్తు, వనమాల శ్రీనివాస్, ఈ ఎల్ ప్రతాప్ కుమార్, ఓములు, శ్యాం కుమార్, దేవుడు కుమార్, లడ్డు, బైరి సురేష్ అమరావతి, సత్యనారాయణ, అరవింద్, శ్రీనివాస్ , సతీష్ రాజు ముదిరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2026 క్యాలెండర్‌ను భరత్ గౌడ్ ఆవిష్కరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png