బాగ్లింగంపల్లి, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) : కుల రహిత సమాజం కోసం, డాక్టర్ బిఆర్.అంబేద్కర్, ప్రముఖ జాతీయ నాయకుడు కాన్షిరామ్ ల ఆలోచన విధానాలను ముందుకు తీసుకపోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సమాంతరంగా మార్చడానికి తమ జీవితకాలం పోరాటాలు చేసిన బహుజన సామాజిక పరివర్తకుల సంస్మరణ సభ హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బంధు సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి ఆధ్వర్యంలో జరిగింది. శనివారం జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా బిఆర్టిఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అప్పికట్ల భరత భూషణ్, ప్రొఫెసర్ కనకయ్య, మాదిగ మహా శక్తి రాష్ట్ర నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నత మేల్, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గుంజగండ్ల బి.కోటేశ్వరరావు, ప్రముఖ రచయిత జూపాక సుభద్ర కృపాకర్, జీలకర్ర శ్రీనివాస్, మంద కనకయ్య, మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆరెపల్లి రాజేందర్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు గండి కృష్ణ, వశపాక నరసింహ, వైబి.సత్యనారాయణ కూతురు మాధవి, రాజలింగం మాదిగ, ప్రముఖ మహిళా నాయకురాలు డి.సంధ్యారాణి, బి.అజితరావు, అడ్వకేట్ విజయ్ కుమార్, మాదిగ మహా శక్తి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఝాన్సీ సిరిపెల్లి, ఓయు జెఏసి నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ… పాతకోట బాలయ్య బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడున్నటువంటి బహుజనులను అందరినీ చైతన్య పరిచారన్నారు. అంతే కాకుండా అంబేద్కర్, కాన్షిరామ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించారన్నారు.

ప్రొఫెసర్ వైవి.సత్యనారాయణ మాట్లాడుతూ…మై ఫాదర్ బాలయ్య అనే పుస్తకం ద్వారా తాను ఎదుర్కొన్న వివక్షతను కండ్లకు కట్టినట్టుగా తెలియపరచడం జరిగిందన్నారు. అది సినిమా రూపంలో ఏడు భాషల్లో రిలీజ్ అయిందని తెలిపారు. బాలయ్య తన జీవితకాలంలో అత్యంత పేదరికం నుండి ఉన్నత విద్యను అభ్యసించి అనేక మందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ” దళిత స్టడీ సర్కిల్ ” సెంటర్లో ఉండి అప్పుడప్పుడే ఎదుగుతూ పైకొస్తున్న అనేకమంది విద్యార్థి, విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తిత్వం మై బాలయ్య అని కొనియాడారు. ప్రముఖ బుద్ధిష్ట్ ప్రచారక్ హరినాథ్ బోధి మాట్లాడుతూ… అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని, తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా బౌద్ధ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. బౌద్ధ మతాన్ని ఆ రోజులలో ప్రచారం చేయడంలో తనకు తానే సాటి అన్నట్టుగా బౌద్ధ మత గురువులే ప్రశంసించారు. నీకు మందిని కలిసి అనేక పెళ్లిళ్లు చేసి బౌద్ధంలోకి నడిపించారు. బౌద్ధమత కుటుంబముకులతో నాకు విడదీయలేని అనుబంధం ఏర్పడిందన్నారు. వారి కృషిని, వారి ఆలోచన విధానాన్ని, ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… ” నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ” అనగారిన, వెనుకబడి తరగతుల ప్రజల మీద ఆ రోజుల్లో దాడులే ఈ రోజుల్లో కూడా దాడులే అంటే రాజ్యాంగానికి అర్థం ఏముందని నిలదీశారు. ఈ ప్రభుత్వాలు మారినా, ఎవరొచ్చినా ఈ దాడులను అడ్డుకోలేకపోతున్నారన్నారు. కుల వ్యవస్థ, మత మాంజ్యంలో బలవుతుంది శ్రామికులే, దళితులే, అనగారిన వారె అని అభిప్రాయపడ్డారు.