కుల ర‌హిత స‌మాజం కోసం అంబేద్క‌ర్‌, కాన్షీరామ్‌ల ఆలోచ‌న విధానాల‌ను ముందుకు తీసుకెళ్ల‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోవాలి

బాగ్‌లింగంప‌ల్లి, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) :     కుల ర‌హిత సమాజం కోసం, డాక్టర్ బిఆర్.అంబేద్కర్, ప్రముఖ జాతీయ నాయకుడు కాన్షిరామ్ ల ఆలోచన విధానాల‌ను ముందుకు తీసుకపోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవాల‌ని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. భార‌త‌దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్య‌వ‌స్థ‌ను సమాంత‌రంగా మార్చ‌డానికి త‌మ జీవిత‌కాలం పోరాటాలు చేసిన బ‌హుజ‌న సామాజిక ప‌రివ‌ర్త‌కుల సంస్మ‌ర‌ణ స‌భ‌ హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో బంధు సొసైటీ అధ్య‌క్షుడు ప‌ల్లెల వీర‌స్వామి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. శ‌నివారం జ‌రిగిన ఈ...