శ్రీ భవాని శంకర దేవాలయంలో గాయత్రీ దేవీ అలంకరణలో అమ్మవారు
భోలక్పూర్, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరం ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ డివిజన్ దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి రూపంలో అలంకరించారు. అలాగే శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన తదితర పూజను నిర్వహించారు. ఈ పూజలకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు....