శ్రీ భవాని శంకర దేవాలయంలో శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
భోలక్‌పూర్, అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్‌లో దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని శ్రీ దుర్గా దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని నిర్వహించారు. అలాగే శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన జరిగింది. ఈ పూజలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు...