శ్రీ భవాని శంకర దేవాలయంలో శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు
భోలక్పూర్, ( అద్దం న్యూస్ ) : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ డివిజన్లో దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో శుక్రవారం అమ్మవారిని శ్రీ సరస్వతి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన జరిగింది. ఈ పూజలకు చిన్నారులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.రాజేష్ కుమార్, ఆలయ సిబ్బంది...