ముషీరాబాద్, అక్టోబర్ 20, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాకారంలో శ్రీ కనకదుర్గ తల్లి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మండపంలో సోమవారం అమ్మవారిని శ్రీ మహిషాసురమర్థిని రూపంలో అలంకరింఆరు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బత్తిని బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పరకాల వేణుబాబు గౌడ్, బిక్షపతి గౌడ్‌ను ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్, రామకృష్ణ గౌడ్, వెంకట్, బాబు గౌడ్, సురేందర్, సుమిత్ర, వీణ, రమ్య తదితరులు పాల్గొన్నారు.
