బస్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఇటీవలే మెట్రోరైలు చార్జీలు పెంచిన ప్రభుత్వం గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బస్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డిని ప్రభుత్వం విరించిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం వల్లనే...