ప్రభుత్వం ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి – జాతీయ బీసీ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్
కాచిగూడ, నవంబర్ 2, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేసి, నిజాయితిని నిరూపించుకోవాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడ నింబోలి అడ్డాలో సోమవారం రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ...