పాత్రికేయుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి – నాగరాజు సంతాపసభలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు,అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన దివంగత సీనియర్ జర్నలిస్టు యడ్లపల్లి నాగరాజు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి సోమయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ... ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని...