Addam News
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 10:10 pm Posted by : Addam News

పశు సంరక్షణకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి – గోశాల ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్

 

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ తెలంగాణలో పశు సంరక్షణకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. వేసవిలో ఎండవేడిమికి నీరు, పశు దాణా సరిగ్గా అందక పశువులు మరణిస్తున్నాయని వాటిని కాపాడే విధంగా ప్రభుత్వం గోశాలలకు నీటి వసతితో పాటు, పశుదాణాను పంపిణి చేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహావీర్ జయంతిని పురస్కరించుకుని జైన్ సేవా సంఘ్, సహయోగ్ ఆధ్వర్యంలో సీనియర్ అడ్వ‌కేట్ దివంగ‌త‌ సీపీ సారధి జ్ఞాపకార్ధం బుధవారం సువర్ణభారతి గోశాలను ఆయన సందర్శించి పశువులకు పశుగ్రాసం పంపిణి చేశారు. అనతరం కాచిగూడలోని గోశాల ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో పశుసంర్థక శాఖ మంత్రిని వెంటనే నియమించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా పశు సంవర్థక శాఖకు మంత్రిని నియమించకపోవడం, ముఖ్యమంత్రి స్వయంగా పశు సంవర్థక శాఖ బాధ్యతలు నిర్వహిస్తుండటం తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే వెయ్యి పనులు ఉన్నాయని, పశు సంవర్థక శాఖకు తగినంత సమయం కేటాయించకపోవడంతో రాష్ట్రంలో పశు సంరక్షణ కుంటుపడుతోందన్నారు. ఆవులు, ఇతర జంతువుల సక్రమ అభివృద్ధి జరిగేలా పశు సంవర్ధక శాఖకు వీలైనంత త్వరగా మంత్రిని నియమించాలని ఆయన సీఎంను కోరారు. గో సంరక్షణకు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంది అవార్డు గ్రహిత నిట్టల గోపాల కృష్ణ. ప్రేమ్చంద్ మునోత్, భక్తరామ్, నరహరి, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png