న‌గ‌ర గ్రంథాల‌యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వాలు ప్రారంభం

హైదరాబాద్, జూన్ 4, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యం ఆవ‌ర‌ణ‌లో నూత‌నంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్ల‌మ్మ అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వం ఈ నెల 6వ తేదీన జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా బుధ‌వారం ఆల‌యం వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి గోపూజతో మ‌హోత్స‌వాల‌ను ప్రారంభించారు. గోపూజ‌తో గ‌ణ‌ప‌తి, పుణ్యాఃవాచ‌నం, పంచ‌గ‌వ్య‌ప్రాశ‌స‌, దీక్షాధార‌ణ‌, ఋత్విక్‌వ‌రుణ‌, యాగ‌శాల ప్ర‌వేశం,...