Addam News
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 12:12 am Posted by : Addam News

ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మ‌హా నేత వైఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి – సీఎం రేవంత్‌రెడ్డి

ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మ‌హా నేత వైఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి
– సీఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీ, సెప్టెంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :  అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో త‌న‌దైన ముద్ర వేసి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మ‌హా నేత డాక్ట‌ర్ వైఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డి అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో బుధ‌వారం ముఖ్య‌మంత్రి ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పుష్పాంజలి ఘటించారు. సాగు నీటి ప్రాజెక్టులు, ఔట‌ర్ రింగు రోడ్డు వంటి అభివృద్ధి ప‌నులు, రుణ‌మాఫీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ వంటి సంక్షేమ ప‌థ‌కాల‌తో పాల‌న‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన నాయ‌కుడు వైఎస్సార్ అని అన్నారు. దివంగత నేత వైఎస్సార్ చిత్ర ప‌టానికి నివాళులర్పించిన వారిలో మంత్రి గడ్డం వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాద‌వ్, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్ త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png