రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం
రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం – సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం, జూలై 10, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆశీర్వాద సభా వేదికగా అశేషంగా తరలివచ్చిన రైతాంగాన్ని ఉద్దేశించి చెప్పారు. గడిచిన 9 రోజుల్లో రూ.9,000 కోట్ల మేరకు 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా చెల్లించిన సందర్భంగా...