Addam News
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 5:27 am Posted by : Addam News

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక పెద్ద కులం మాదిగ కులం – మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక పెద్ద కులం మాదిగ కులం
» మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

హైదరాబాద్, ఫిబ్రవరి 22, అద్దం న్యూస్ :   తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక పెద్ద కులం మాదిగ కులం అని మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో బంధు సొసైటీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ, రిటైర్డ్ ఐఆర్‌టిఎస్ అధికారి అప్పికట్ల భరత్ భూషణ్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మాట్లాడుతూ… మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దాని కోసం మాదిగ మహాశక్తి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పనిచేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల కోసం, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వాటిని తప్పకుండా అమలు చేయించుటకు బాధ్యత తీసుకుంటామన్నారు. డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ మాట్లాడుతూ… నేటి ప్రభుత్వం చదువుకుంటున్న పేద విద్యార్థులను గుర్తించి, పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకి చదువుల నిమిత్తం ఇతర ఆర్థిక అవసరాల నిమిత్తం అందిస్తున్న సహాయ సహకారాలు ఎక్కువ మొత్తంలో జరగాలన్నారు.

బంధు సొసైటీ నూత‌న క‌మిటీ ఏర్పాటు :

బంధు సొసైటీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా పల్లెల వీరస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి.ఎల్లయ్య, కార్యదర్శిగా మంద కనకయ్య, ఆర్గనైజర్‌గా వశపాక నరసింహ, కోశాధికారిగా పి.ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ కమిటీగా గండి కృష్ణ, ఎస్.నరసింగరావు, ఎస్ సత్యనారాయణ, సి.రవీంద్రాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పల్లెల వీరస్వామి మాట్లాడుతూ…షెడ్యూల్ కులాల కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలలో చదువుల కోసం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కొనసాగించాలని, ఎస్సీ కార్పొరేషన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png