Addam News
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 11:26 am Posted by : Addam News

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిలిదే..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: త్రివిక్రం దర్శకత్వంలో వెంకటేశ్‌ (Venkatesh) కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘హౌస్‌ నం47 (AK47)’ అనేది ఉప శీర్షిక. నేడు ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.

అలాగే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ నేటినుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ వెంకటేశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా పంచుకున్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో వెంకటేశ్‌ సింపుల్‌లుక్‌లో మధ్యతరగతి వ్యక్తిగా ఆకట్టుకుంటున్నారు. సంచలన విజయం సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేశ్‌ సోలోగా నటిస్తున్న సినిమా ఇదే. వెంకటేశ్‌ కథానాయకుడిగా ఇదివరకు వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ని అందించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png