వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా టైటిలిదే..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: త్రివిక్రం దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘హౌస్ నం47 (AK47)’ అనేది ఉప శీర్షిక. నేడు ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటినుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ వెంకటేశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు....