Addam News
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 4:31 am Posted by : Addam News

ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేయ‌డం అమానుషం

ప్రిన్సిపాల్ కె.రూపా రెడ్డిని హత్య చేయ‌డం అమానుషం
– ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.స్వర్ణలత

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 21, ( అద్దం న్యూస్ ) :   ప్రైవేట్ పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ కె.రూపా రెడ్డిని విద్యార్థులే హత్య చేయ‌డం అమానుషమ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌ ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.స్వర్ణలత లు అన్నారు. శుక్ర‌వారం వారు మాట్లాడుతూ… గతంలో అన్నీ ప్రభుత్వ పాఠశాలలే ఉండేవని, ఆ రోజుల్లో ఉపాధ్యాయులకు, వారి మాటలకు చాలా గౌరవం ఉండేదన్నారు. పిల్లల క్రమశిక్షణ విషయంలో ఉపాధ్యాయులు దండించినా వారి పిల్లలను వెనుకేసుకొచ్చేవారు కాదన్నారు. ప్రస్తుత రోజుల్లో పాఠశాలలను నడపడం చాలా క్లిష్టంగా మారిందని, కారణం చిన్న కుటంబ వ్యవస్థ, ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తాము పొందని విద్యను, ఎంతో ఆశతో తాము పొందని విద్యను తమ పిల్లలకు అందించి విద్యావంతులుగా చేయడానికి ఎంతో వ్యయప్రయాసాలకైనా వెనుకాడడం లేదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను అతి గారాబం చేయడం, మొబైల్ వినియోగంలో కట్టడి చేయలేకపోవడం, కొన్ని విషయాల్లో పిల్లలు టీచర్ల పై చెప్పే కల్పితాలను నిజమని నమ్మి పాఠశాలకు వచ్చి ఆశాంతిని సృష్టిస్తున్నారని తెలిపారు.

కొన్ని సార్లు తల్లి దండ్రులు సంఘాల మద్దతు కూడ గట్టుకొని పాఠశాల యాజమాన్యాల నుండి డబ్బు డిమాండ్ చేయడం, మీడియాను పిలుస్తామని, పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తామని దౌర్జన్యంతో బెదిరింపులకు పాల్ప‌డ‌డం ఇలా ఇతరత్రా ఎన్నో సమస్యలకు కారకాలవుతున్నారన్నారు. క్ర‌మశిక్షణ మొదట ఇంటి నుండే మొదలు కావాలి, కాని అది కొరవడుతుందని, పాఠశాల యాజమాన్యాలు నైతిక భాధ్యతతో నిర్వహిస్తున్నప్పటికి ఇలాంటి చర్యల వల్ల ఎప్పుడు ఏమవుతుందో అనే అభద్రతా యాజమాన్యాలను పీడిస్తుందని పేర్కొన్నారు. పిల్లల ఇలాంటి చర్యల వల్ల తల్లిదండ్రులును నిద్రలేని రాత్రులకు గురిచేస్తున్నాయని, నేటి సమాజంలో పిల్లల్లో భయం లేదు, తల్లి దండ్రులకు ఉపాధ్యాయులపై నమ్మకం, గౌరవం కొరవడిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాఠశాల నుంచే దేశ నిర్మాణం మొదలవుతుందనేది నిజం, కాని ప్రస్తుత సమాజంలో తల్లి దండ్రుల ఆలోచన విధానంలో మార్పు జరగనంత వరకు మంచిని ఆశించలేమన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రతీదానికి పిల్లలకు వత్తాసు పలకరాదన్నారు. తల్లిదండ్రులు తమ పొరపాట్లను సరిదిద్దుకొని పిల్లల పై కఠిన నిఘా ఉంచాలని, మొబైల్ అవసరం మేరకే వినియోగించేలా, పిల్లలు వారి అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని కోరారు. పూర్తిగా పిల్లలు చెప్పిందే వినకుండా నిజ నిర్థారణ చేసుకోవాలని, తద్వార మనం మన భావి పౌరులను సన్మార్గంలో చూడగలమ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png