Addam News
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 4:16 am Posted by : Addam News

జాతీయ జెండా భారత దేశ ఐక్యత, సమగ్రత, గౌరవం, దేశ భక్తికి ప్రతీక

జాతీయ జెండా భారత దేశ ఐక్యత, సమగ్రత, గౌరవం, దేశ భక్తికి ప్రతీక
» మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 12, ( అద్దం న్యూస్ ) :   జాతీయ జెండా భారత దేశ ఐక్యత, సమగ్రత, గౌరవం, దేశభక్తికి ప్రతీక అని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని ద‌త్తాత్రేయ‌ నివాసం పై జ‌రిగింది. బుధ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి లు హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన మరింత బలపడుతుందన్నారు. స్వాతంత్య్ర‌ సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికృష్ణ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png