Addam News
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:05 am Posted by : Addam News

సామాజిక సేవలో పోలీసుల చొరవ అభినందనీయం – బీజేపీ నాయకుడు శ్రీరామ్ వెంకట్

తార్నాక, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) :  

ప్రజల భద్రతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుండటం అభినందనీయమని తార్నాక బీజేపీ నాయకుడు శ్రీరామ్ వెంకట్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేష‌న్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయ‌న‌ పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్రజాసేవ, మానవత్వం, సామాజిక బాధ్యతకు ఈ రక్తదాన శిబిరం నిదర్శనంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ రక్షిత మూర్తి, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్‌, సీఐ దాస్‌, ఎస్‌ఐ కావ్యతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని అభినందించారు. రక్తదాతల సేవలు అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యతపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.