Addam News
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 6:55 am Posted by : Addam News

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ప్రమాదవశాత్తు,మరియు సహజ మరణం చెందిన క్లెయిమ్ లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలి అనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఐటీయూసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన భారీ ధర్నాలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ రంగాలకు ఇవ్వాలని ప్రభుత్వము ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. 2009 నుంచి మన రాష్ట్రంలో లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు పథకాలు అందుతున్నాయని, ఇప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా భీమా రంగానికి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం ఆలోచించాల‌న్నారు. రాష్ట్రంలో 15 లక్షకు పైగా మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదయి ఉన్నారని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా చెల్లిస్తున్నటువంటి డబ్బులు లేబర్ డిపార్ట్‌మెంట్‌ చేతులు దులుపుకొని బీమా కంపెనీకి అప్పజెప్పడంలో మతల ఏంటో చెప్పాలని అన్నారు. అధికారులు ఎలాంటి కారణాలు చెప్పకుండా గోప్యంగా ఉంచడంలో అంతరం అంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. భీమా కంపెనీలకు అప్పజెప్పడం అంటే సంక్షేమ బోర్డు ఎత్తి వేసే కుట్రలో భాగమే అని ఆరోపించారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు పెన్షన్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇన్సూరెన్స్ రంగానికి ఇచ్చే టెండర్లు వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.

ఏఐటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్ మాట్లాడుతూ… ఈ నెల నాలుగో తేదీన గుట్టు చప్పుడు కాకుండా సంక్షేమ బోర్డు వారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి టెండర్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇన్సురేన్స్ కంపెనీకి అప్పజెప్పడం వల్ల కార్మికులకు వచ్చే అదనపు ప్రయోజనాలు ఏంటో చెప్పట్లేదన్నారు. సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ లేబర్ అధికారులు కార్మికులకు నిధులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తూ ఈరోజు అప్పనంగా బీమా కంపెనీలకు అప్పచెప్పటం విచారకరమని అన్నారు. కార్మికులను కార్మిక శాఖకు దూరం చేసే కుట్రలో భాగంగా ఇలాంటి ప్రయత్నం లేబర్ అధికారులు ప్రభుత్వం కూడాబల్కు కొని చేస్తున్నారని అన్నారు. లేబర్ అధికారులు తమ పని భారం తగ్గించుకోవడం కోసం బీమా కంపెనీలకు సంక్షేమ బోర్డు నిధులు మళ్ళిస్తున్నారని అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. రెన్యువల్ గ్యాప్ పేరుతో క్లెయిమ్ నిలిపివేయడం విచారకరమని అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు క్లైములు భీమా కంపెనీలకు అప్పజెప్పే టెండర్లు వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మోటె నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ గన్నారపు రమేష్, అధ్యక్షుడు ఏం ప్రవీణ్ కుమార్,ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్, శ్రీనివాస్, పర్వతాలు, బిఓసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రాజు, వెంకటేశ్వర్లు, గాదె లక్ష్మీనారాయణ, పరమేష్, సహాయ‌ కార్యదర్శులు కమతం యాదగిరి, ఎస్ మల్లేష్, వెంకటేష్, మల్లికార్జున్, శివశంకర్ కోశాధికారి నర్సింహారెడ్డి, శ్రీనివాస్, గణేష్, కాషయ్య, బి కిషన్, రాజు, గోవర్ధన్, అశోక్, ఎన్.రామస్వామి, లక్ష్మణ్, లావణ్య, రాజమ్మ, రజిత, తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png