భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ : భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ప్రమాదవశాత్తు,మరియు సహజ మరణం చెందిన క్లెయిమ్ లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలి అనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఐటీయూసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన భారీ ధర్నాలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు...