ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై రూ.5.44 కోట్ల జరిమానా రద్దు చేయాలి – తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్

హైద‌రాబాద్‌, అక్టోబర్ 24, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్మీడియట్ బోర్డు విధించిన రూ.5.44 కోట్ల జరిమానాలను రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ డిమాండ్ చేశారు. అర్హత ఉన్న కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న అనుబంధ గుర్తింపులను వెంటనే మంజూరు చేయాలని, బోర్డు ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గౌరీ స‌తీష్...