Addam News
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 10:40 pm Posted by : Addam News

రాష్ట్రంలో స‌రిగ్గా అమ‌లు కానీ రైతు భరోసా ప‌థ‌కం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ :    రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రభుత్వం చేపట్టిన పథకం రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు భ‌రోసా పథకం కింద దరఖాస్తు చేసుకునే రైతులు నేటితో గడువు ముగుస్తుండడంతో చాలా మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రైతు భరోసా గడువు చాలా తక్కువగా ఇవ్వడం, చాలా మంది రైతుల దరఖాస్తు చేసుకోలేకపోయారని అన్నారు. ప్రభుత్వం ఏదో ఆదరా బాదరాగా రైతు భరోసాను అమలు చేయడం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు అందేలా ద‌రఖాస్తు చేసుకునే గడువు పెంచాలని అన్నారు. ఎకరానికి 5 వేల చొప్పున 5 ఎకరాలలోపు రైతులు రైతు భరోసా పథకానికి అర్హులని ప్రకటించడం జరిగింద‌న్నారు. మూడు రోజుల కింద ఈ పథకాన్ని ప్రకటించార‌ని.. దాని గడువు నేటితో ముగియనుంద‌న్నారు. రైతుల ధరఖాస్తులో సంబంధిత పత్రాలు లేవని సగానికి పైగా రైతులను అనర్హులుగా తిరస్కరించడం విచారకరమన్నారు. సరైన పత్రాలు సమకూర్చడం కొరకు రైతులు ధరఖాస్తు చేసుకునే సమయం లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే రైతు భరోసా దరఖాస్తు చేసుకోవడానికి గడవు పెంచాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసే సమయంలో సర్వర్లు పని చేయక చాలామంది రైతులు ద‌రఖాస్తు చేసుకోలేదన్నారు. పై సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరో వారం రోజులు గడువు పెంచాలని సాయిబాబా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల‌ కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, కిరణ్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png