Panchayat elections: రెండో దశ పంచాయతీ పోరు నేడే
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నిర్వహణకు రంగం సిద్ధమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగు కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది....