రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్

ఎల్‌బి న‌గ‌ర్‌, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో ప్రభావంతో వర్షాలు కురవక ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం ఎల్‌బి న‌గ‌ర్‌లోని బిసి భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ...రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల మూలంగా అనేక మంది రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. కొంత మంది రైతులు బోర్ల మీద ఆధారపడి సాగు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వము...