కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీయే

కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీయే

– తెదేపా సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్

హైద‌రాబాద్‌, ఆగస్టు 13, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా కొండంత అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ పేర్కొన్నారు. ఇటీవల ఆకస్మికంగా తీవ్ర గుండెపోటుకు గురై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన, వైద్యుల మెరుగైన చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యాన్ని కోలుకుని గురువారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే… సోమవారం సాయంత్రం నల్లెల్ల కిషోర్‌కు హఠాత్తుగా గుండెపోటు రాగా, వెంటనే కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. సమాచారం అందుకున్న ప్రత్యేక వైద్య బృందం తక్షణమే స్పందించి ప్రాణాపాయ స్థితి నుంచి ఆయనను కాపాడేందుకు చికిత్స అందించారు. 

ఈ క్రమంలో ఆసుపత్రి వైద్య చికిత్స బిల్లులో కొంత మొత్తాన్ని ఆయన వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా చెల్లించినప్పటికీ, మిగిలిన పెద్ద మొత్తాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బక్కని నరసింహులు ద్వారా ఆసుపత్రి యాజమాన్యానికి నేరుగా అందజేయడం జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉండటంతో వైద్యులు ఈరోజు మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద తనను పరామర్శించేందుకు వచ్చిన నాయకులు, శ్రేణులతో నల్లెల్ల కిషోర్ మాట్లాడారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తను, నాయకుడిని తెలుగుదేశం పార్టీ తన కుటుంబ సభ్యుడిగా భావిస్తుందన్నారు. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వెంటనే స్పందించి, ఆర్ధిక సహాయం అందించి ఆదుకున్న అధినేత నారా చంద్రబాబు నాయుడి కి నా జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ సంఘటనే తెదేపా తన శ్రేణుల పట్ల చూపే నిబద్ధతకు నిదర్శనం అని కిషోర్ భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు రాష్ట్ర బిసి సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్, కరణం కిరణ్, తడక వినోద్ తదితరులు నల్లెల్ల కిషోర్‌ను పరామర్శించి, ఆయన త్వరగా పూర్వపు ఉత్సాహంతో ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page