Addam News
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 3:28 am Posted by : Addam News

నవంబర్ 6 న నిర్వహించే TGPSC AEE పరీక్షను వాయిదా వేయాలి

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :      నవంబర్ 6 న నిర్వహించే TGPSC AEE పరీక్షను వాయిదా వేయాల‌ని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్ అన్నారు. హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లి సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్ మాట్లాడుతూ… న‌వంబ‌ర్ 6వ తేదీన ఏఈఈ ప‌రీక్ష‌తో పాటు అదే రోజున ఎస్ఎస్‌సి నిర్వ‌హించే ఎస్ఎస్‌సి జేఈ ప‌రీక్ష కూడా ఉంద‌న్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో ఏళ్ల తరబడి కష్టపడిన విద్యార్థులు ఒక్క ప‌రీక్ష‌ను వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. అసలే నోటిఫికేష‌న్లు లేక గత 3 సంవత్సరాల నుండి నిరుద్యోగులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నార‌ని… వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా నిర్వహించకపోతే ఎలా అన్ని ప్రశ్నించారు. ప్ర‌భుత్వాన్ని, టీజీపిఎస్‌సి చైర్మ‌న్ ను వేలాది మంది ఇంజనీరింగ్ నిరుద్యోగ విద్యార్థులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకొని పరీక్షను వాయిదా వేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు కుమార్ రాథోడ్, హుస్సేన్, చరణ్ మహిపాల్, సాయి తదితరులు పాల్గొన్నారు.