Addam News
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 2:15 am Posted by : Addam News

జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం హ‌ర్ష‌ణీయం – జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ

 

జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం హ‌ర్ష‌ణీయం

– జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ

 

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :  దేశంలో జనగణనలో కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రకటించడం హర్షనీయమని జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ అన్నారు. ఈ విజయం రాహుల్ గాంధీ దేనని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైద‌రాబాద్ హిమాయత్‌న‌గ‌ర్‌లోని ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ బిల్లులను ఆమోదిస్తూ తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని, 22 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన బీసీ ఆజాది జేఏసీ చైర్మన్, హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర పటేల్ దీక్ష ఫలించిందన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడతామని ప్రకటన విడుదల చేయడం గొప్ప పరిణామం అన్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్షకు నేతృత్వం వహించిన ఆలిండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ, హిందూ బీసీ మహాసభ కార్యవర్గానికి, బీసీ ఆజాది ఫెడరేషన్, రాష్ట్ర అంబేద్కర్ ఆజాది సంఘం, బీసీ సంక్షేమ సంఘం వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నాయకులు బత్తుల సిద్దేశ్వర పటేల్ కు సంఘీభావం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జనగణనలో కుల గణన చేస్తామని ప్రకటించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదంతా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గిన ఫలితంగానే బీసీలకు ఈ విజయం దక్కిందని వివరించారు. దేశంలోని 76 కోట్ల ఓ బీసీల తరఫున డ‌బ్ల్యుపి నెంబర్1414 /2020 లో జన గణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టులో కేసు వేసి.. డాక్టర్ కె.చౌహన్ వంటి ప్రసిద్ధ లాయర్లను నియమించుకొని, గత ఆరేళ్లుగా తీవ్ర పోరాటం జరిపిన విషయం గుర్తు చేసినారు అన్ని సంఘాలను సమన్వయం చేసుకొని ముఖ్యంగా ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ సహకారంతో పోరాటం లక్ష పోస్టు కార్డుల ఉద్యమం కొనసాగించానని పేర్కొన్నారు. వీటన్నింటి ఫలితంగానే జనగణనలో కులగణనకు కేంద్రం నడుంబిగించినట్లు ఆయన స్పష్టం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png