Addam News
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 1:18 pm Posted by : Addam News

ఎన్‌టిఆర్‌ అభిమాని రామచంద్ర రాజు అకాల మరణం పార్టీకి తీరని లోటు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ఎన్‌టిఆర్‌ అభిమాని రామచంద్ర రాజు అకాల మరణం పార్టీకి తీరని లోటు
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ : ఎన్‌టిఆర్‌ అభిమాని రామచంద్ర రాజు అకాల మరణం పార్టీకి తీరని లోటని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడలోని టిడిపి న‌గ‌ర కార్యాలయంలో రాజు సంస్మరణ సభ జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పై అంతులేని అభిమానాన్ని చాటుకుంటూ, ఆయన ఆశయాల కోసం శ్రమించిన స్వర్గీయ రాజు ( ఎన్‌టిఆర్ రాజు) అకాల మరణం పట్ల తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి. సాయిబాబా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించక ముందు నుండే రాజు ఎన్‌టిఆర్‌ కు వీరాభిమానిగా ఉండేవారని, ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా ఎన్‌టిఆర్‌ కు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కలిసి పనిచేశారని సాయిబాబా కొనియాడారు. దశాబ్దాల పాటు ఎన్‌టిఆర్‌ అభిమానులను సమన్వయం చేస్తూ, వారికి దిశానిర్దేశం చేస్తూ, వారందరికి ఎన్‌టిఆర్‌ రాజు ఒక గొప్ప స్ఫూర్తి అని అన్నారు. రాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, నాగు నగేష్, తడక వినోద్, ఆనిల్ కురుమ, రవి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png