Addam News
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 2:21 am Posted by : Addam News

క‌మ‌నీయంగా శ్రీనివాసుని క‌ళ్యాణం

 

క‌మ‌నీయంగా శ్రీనివాసుని క‌ళ్యాణం

 

శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ల్ల‌కిసేవ‌, త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల దృశ్యాలు.
శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ల్ల‌కిసేవ‌, త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల దృశ్యాలు.

హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :       ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో కొన‌సాగుతున్న స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం ఆల‌యంలో విశేష పూజ‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా శ్రీనివాసుని క‌ళ్యాణం క‌మ‌నీయంగా జ‌రిగింది. అంత‌కుముందు బిందేతీర్థం, బాలభోగం, బ‌లిహార‌ణ‌ము, హ‌వ‌నం, మంత్ర‌పుష్పం, బ‌లిహార‌ణం, ప‌ల్ల‌కి సేవ, మ‌హానివేద‌న త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఆల‌య వంవ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త జి.శ్రీనాథ్‌గౌడ్‌, కీర్తి, సువ‌ర్ణ‌ల‌త‌, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారిణి అన్న‌పూర్ణ‌, భ‌క్తులు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా, డివిజ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు శంక‌ర్ ముదిరాజ్‌, దామోద‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముదిగొండ ముర‌ళీ, ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, ఇంధ్ర‌సేనారెడ్డి, గోక న‌వీన్‌, శ్రీనివాస్ గుప్త‌, మార్గం అమ‌ర్ నేత, శంక‌ర్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png