హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలి – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంకల్పానికి యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో మరింతగా అభివృద్ధి సాధించి, దేశంలోనే ఆదర్శనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. హైదరాబాద్ ఎన్‌టిఆర్‌ స్టేడియంలో బుధ‌వారం పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ......