Addam News
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 11:56 am Posted by : Addam News

స్వామి వివేకానంద ఆదర్శాలను యువ‌త‌ అలవర్చుకోవాలి – పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

స్వామి వివేకానంద ఆదర్శాలను యువ‌త‌ అలవర్చుకోవాలి
– పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైదరాబాద్, జ‌న‌వ‌రి 12, అద్దం న్యూస్ :   స్వామి వివేకానంద ఆదర్శాలను యువ‌త‌ అలవర్చుకోవాలని తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ చైర్మన్, తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ ట్యాంక్‌బండ్‌పై స్వామి వివేకానంద స్వామి జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై స్వామి వివేకానంద స్వామి విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు కృషి చేయాలని అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు ఆయన ఆలోచనలు నిరంతర ప్రేరణగా ఉంటాయన్నారు. స్వామి వివేకానంద జీవితం, సందేశాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు. స్వామి వివేకానంద ఉన్నత ఆలోచనలను కేవలం స్మరించడమే కాకుండా, వాటిని మన దైనందిన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png