Addam News
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 10:18 pm Posted by : Addam News

హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉంది – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

 

 

హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉంది

– కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

 

మాట్లాడుతున్న కిష‌న్‌రెడ్డి
మాట్లాడుతున్న కిష‌న్‌రెడ్డి

 

హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :    హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉందని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ శ్రీనివాస ప్లే గ్రౌండ్‌లో అండ‌ర్ – 14 క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభ‌మైంది. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని, నివి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో రెండు రోజుల పాటు జ‌రిగే ఈ టోర్న‌మెంట్‌ను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… జీహెచ్ఎంసీతో పాటు, కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పార్కుల అవసరం ఉన్నప్పటికీ, పిల్లలకు ఆటల కోసం ఓపెన్ గ్రౌండ్లు అవసరం అని.. ఇవి వారి భవిష్యత్తుకు ఎంతో అవసరమ‌న్నారు. ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా, వీటిని ఓపెన్ గ్రౌండ్లుగా, ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స్థలాలు రాబోయే తరాల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతి బస్తీ, కాలనీలోని సంఘాలు తమ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్లను పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలను పచ్చదనంగా ఉంచుతూ, పిల్లల కోసం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల‌ని అన్నారు. ఈ క్రికెట్ పోటీలను నిర్వహించిన నిర్వాహకులకు, పాల్గొంటున్న యువ క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. విద్యా సంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ, బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు భారత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయ‌కులు రమేష్ రామ్, నవీన్ కుమార్, శ్రీకాంత్, దామోదర్, విఎస్‌టి రాజు, ఎం.ఉమేష్, పాల శ్రీను, మహమూద్, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, సురేష్, మదన్మోహన్, శ్రీనివాస్, ఆనంద్ రావు, సాయి కుమార్, నర్సింహ, సురేష్, హన్మంతు, యాదగిరి, అరుణ్ కుమార్, రాహుల్, సాయి తేజ, నీరజ్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png