కార్మిక శాఖ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ప్రభుత్వ కార్మిక శాఖ స్థలాన్ని కబ్జా చేయాలని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి స్థలాన్ని కాపాడి, వారి పై తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ కుమార్ మాట్లాడుతూ... 1966లో అనసూయ అనే మహిళకు కార్మిక శాఖకు సంబంధించిన దాదాపు...