కుంటి సాకులతో రిజర్వేషన్లకు ఎగనామం పెడితే ఊరుకునేది లేదు – తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా బబ్లూ గౌడ్
హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని, కుంటి సాకులతో రిజర్వేషన్లకు ఎగనామం పెడితే ఊరుకునేది లేదని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా బబ్లూ గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. 1995లో గెలిచిన సర్పంచులకు కోర్టు ఆదేశాలతో 6 నెలలు అధికారం ఇవ్వని సంఘటనలు పునరావృతం కావద్దన్నారు. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోగా నిర్వహించి, ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని, 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు...