అమ్మే మృత్యువై తోసేస్తే.. ఆపద్బాంధవులై కాపాడారు !
సాగర్లో మునిగిపోతున్న ఆరేళ్ల పసిపాపను రక్షించిన ముగ్గురు పౌరులు – ప్రాణదాతలకు నగర సీపీ సజ్జనర్ ఘన సత్కారం, నగదు పురస్కారం బషీర్బాగ్, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) : హుస్సేన్సాగర్లో మునిగిపోతున్న ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్న చిన్నారికి తక్షణమే ఆపన్నహస్తం అందించి ప్రాణదాతలుగా నిలిచిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేటు ఉద్యోగి కె.బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్...