అంగ‌రంగంగా తిరుచెందూరు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం

హైద‌రాబాద్‌,  ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో భాగంగా రెండవ‌ రోజు అయిన ఆదివారం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. శంఖారావం, వేదపఠనంతో ప్రారంభమైన ఉత్సవాల్లో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రతిమ బృందం భక్తిగీతాలు ఆలపించగా, డాక్ట‌ర్‌.తాడేపల్లి పతంజలి శాస్త్రి ప్రవచనం భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. శివశ్రీ స్కందప్రసాద్ భజన గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య వేలాయుధ కావడి పూజ ఘనంగా నిర్వహించారు. ప్రాంగణంలో భక్తులు సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలకు పుష్పార్చన...