Addam News
Newspaper Banner
Date of Publish : 01 July 2025, 1:06 am Posted by : Addam News

సొంత వ్యాపారంతో నలుగురికీ ఉపాధి కల్పించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్


హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ :       సొంత వ్యాపారంతో నలుగురికీ ఉపాధి కల్పించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని వై జంక్ష‌న్ వ‌ద్ద దోమ‌ల‌గూడ వాసి శ్రీనివాస్ నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ ధ‌ర‌ణి టెంట్‌హౌస్ ప్రారంభోత్స‌వం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కార్పొరేట‌ర్ పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు టెంట్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… సొంతగా వ్యాపారాలు చేసే యజమానులు నలుగురికీ ఉపాధి కల్పించే విధంగా తోడ్పడాలని అన్నారు. నూతన టెంట్ హౌస్ అభివృద్ధి చెంది మంచి లాభాలను అందించాలని కోరారు. నిరుద్యోగ యువ‌త స‌మ‌యం వృధా చేయ‌కుండా ప్ర‌భుత్వం అంద‌చేసే రుణాల‌ను సైతం స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి నాయ‌కులు వి.నవీన్, సాయి, శ్రీకాంత్, ఎం.ఉమేష్, చిర్రా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png