సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : సాంప్రదాయ కళలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కళా కృష్ణ అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కళ్యాణ్ హంపి థియేటర్ లో నిర్వహించనున్న వసంతోత్సవ వేడుకలలో మూడవ రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆంధ్ర నాట్యానికి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో కళాకారులను ప్రోత్సహించినప్పుడే కళలు విరాజిల్లుతాయని పేర్కొన్నారు. సభకు ముందు కళా కృష్ణ శిష్య బృందం ప్రదర్శించిన ఆంధ్ర నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png