విషాదం.. ఏసీ పేలి కవలల మృతి
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంట్లోని ఎయిర్ కండిషనర్ (AC) (AC explosion) ఒక్కసారిగా పేలిపోవడంతో, నిద్రిస్తున్న ముక్కుపచ్చలారని మూడేళ్ల కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్‌నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అంజుమన్ ఖాదీమల్ ముస్లీమిన్ విద్యాసంస్థల కార్యదర్శిగా పనిచేస్తున్న సయ్యద్ సైఫుద్దీన్ ఖాద్రీ తన కుటుంబంతో కలిసి అంజుమన్ మసీదు ప్రాంగణంలోని నివాసంలో ఉంటున్నారు. ఆయనకు నలుగురు సంతానం కాగా, వారిలో రహీం ఖాద్రీ, రహ్మాన్...