నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచి అభ్యర్థి భర్త ఆత్మహత్య
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రాజకీయ ఒత్తిళ్లు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేశాయి. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ (సోమార్‌పేట్) గ్రామంలో సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త బండారి రవీందర్ (54) గురువారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్థులు, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం... గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా, నీటి సంఘం ఛైర్మన్‌గా పనిచేసిన రవీందర్, ఇటీవల (నెల 29న) భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీలో...