రైళ్ల‌ల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ – ల్యాప్‌టాప్‌, ఐ ప్యాడ్, 13 సెల్‌ఫోన్లు స్వాదీనం

కాచిగూడ, మే 27, అద్దం న్యూస్ :   రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డిఎస్పీ ఎస్ఎన్ జావేద్, కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్ట‌ర్‌ ఆర్.ఎల్లప్ప, ఆర్‌పిఎఫ్ కాచిగూడ ఇన్‌స్పెక్ట‌ర్‌ గోరఖ్నాథ్ మల్ వివరాలు వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గోషామహాల్ ప్రాంతానికి చెందిన నవనీత్ శర్మ (32) అనుమానస్పదంగా ఉండగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల...