Addam News
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:19 pm Posted by : Addam News

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు కలరిపయట్టు క్రీడాకారులకు శిక్షణ

తార్నాక‌, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :    కలరిపయట్టు క్రీడాకారులను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సిద్ధం చేసేందుకు ఇండియన్ కలరిపయట్టు ఫెడరేషన్ ( ఐకేఎఫ్ ), కలరిపయట్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( కేటీజీ ) సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. క్రీడాకారుల నైపుణ్యాల పెంపుతో పాటు పోటీల నిబంధనలు, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో ఎంపికైన క్రీడాకారులు తుది ఎంపికకు ముందు మరింత విస్తృత శిక్షణ పొందనున్నారు. నవంబర్ 27 నుంచి 29 వరకు తిరువనంతపురంలో జరిగే 19వ జాతీయ కలరిపయట్టు ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కూడా కల్పించనున్నారు.

ఐకేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అంబు ఆర్.నాయర్, సాంకేతిక అధికారులు శ్రీజయన్ పిఈ. గురుక్కల్, అంబరీష్ గురుక్కల్ మార్గదర్శకత్వంలో శిక్షణ కొనసాగింది. తెలంగాణలో కలరిపయట్టు అభివృద్ధికి, యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ శిబిరం దోహదపడుతుందని కేటీజీ జాయింట్ సెక్రటరీ రాఘవ్ ముకుంద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఐకేఎఫ్ నాయకత్వంతో పాటు కేటీజీ అధ్యక్షురాలు ధనలక్ష్మి మహాదేవ్, కార్యదర్శి టి.రమేష్, కోశాధికారి డాక్టర్ ఆది భవాని శంకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.