ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు కలరిపయట్టు క్రీడాకారులకు శిక్షణ

తార్నాక‌, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :    కలరిపయట్టు క్రీడాకారులను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సిద్ధం చేసేందుకు ఇండియన్ కలరిపయట్టు ఫెడరేషన్ ( ఐకేఎఫ్ ), కలరిపయట్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( కేటీజీ ) సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. క్రీడాకారుల నైపుణ్యాల పెంపుతో పాటు పోటీల నిబంధనలు, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో ఎంపికైన క్రీడాకారులు తుది ఎంపికకు ముందు మరింత విస్తృత శిక్షణ పొందనున్నారు. నవంబర్...