Addam News
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 11:29 am Posted by : Addam News

మాజీ సీఎం టి.అంజ‌య్య‌కు ఘ‌నంగా నివాళులు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) :   

మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య 40 వ వర్ధంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌ లుంబినీ పార్క్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ పిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రభుత్వ సలహాదారు హనుమంత్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్, మాజీ ఆర్యవైశ్య కమిషన్ చైర్మన్ కల్వ సుజాత త‌దిత‌రులు హాజ‌రై టి.అంజ‌య్య విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు.