భక్తి శ్రద్ధలతో తులసీ దామోదర కల్యాణోత్సవం
హైదరాబాద్, నవంబర్ 21, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 ఎనిమిదో ( శనివారం ) రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా జరిగాయి. ప్రదోషకాల అభిషేకం, వివిధ దేవతామూర్తుల విశేష పూజలు, తులసీ దామోదర కల్యాణోత్సవం, సామూహిక కార్తీక దీపారాధన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రారంభంలో శంఖారావం, వేదపఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. బాలత్రిపురసుందరిదేవి అలంకారంలో దుర్గమ్మ హారతి దర్శనం భక్తులకు కనులవిందు...