ఆంజనేయస్వామి దేవాలయంలో వైభవంగా తులసి కృష్ణ కళ్యాణం
ముషీరాబాద్, ( అద్దం న్యూస్ ) : కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన క్షీరాబ్ది ద్వాదశి ( ఉత్థాన ద్వాదశి ) సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో తులసి కృష్ణ కళ్యాణం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో తులసి కృష్ణ కళ్యాణం వైభవంగా జరిగింది. పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు, మాంగల్యంతో శాస్త్రోక్తంగా తులసి కృష్ణుల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ...