తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్యక్షుడిగా తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్యక్షుడిగా తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల ప్రయోజనాలే లక్ష్యంగా టియుజేఏసి అభివృద్ధికి పాటుపడుతామని టియుజేఏసి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టియుజేఏసి ) రాష్ట్ర కార్యాలయంలో అత్యవసర రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం సర్పంచుల సంఘం నాయకులు మంచాల వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన టియుజేఏసి...