పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు అడ్వొకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యాంకర్ మంగళవారమే రావాలని నోటీసులు ఇచ్చినా షూటింగ్ కారణంగా గైర్హాజరు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్లారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ...